Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవాల రథయాత్ర..

భారత రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవాల రథయాత్ర..

- Advertisement -

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
నవతెలంగాణ – కంఠేశ్వర్

భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని, భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ ధర్మపురి సంజయ్, లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు, అనంతరం భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలుక శ్రీనివాస్, రథయాత్ర కో కన్వీనర్లు మల్యాల గోవర్ధన్, సఖి విజయ్, ప్రభంజన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రథయాత్ర వాహనాన్ని గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హందాన్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆవిర్భావ ఏం పేరు వజ్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, హమారా భారత్, హమారా సంవిధాన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఆచరణీయమైన రాజ్యాంగం అని అన్నారు, నేటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో ఉందని, దానిని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -