Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో బాలికల గురుకులలో వైద్య శిబిరం 

రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో బాలికల గురుకులలో వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో  మోపాల్ మండలంలో గల కంజర గ్రామంలో గల బాలికల గురుకుల పాఠశాలలో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలైన డాక్టర్ అరుణ చే బాలికలకు సంబంధించినటువంటి సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐదు సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు వారికి తగిన సమయంలో వచ్చే నెల ఋతుక్రమం గూర్చి తెలియజేస్తూ రుతుక్రమం వచ్చినప్పుడు ఆడపిల్లలు భయపడకూడదు అని అది సహజంగా ప్రతి స్త్రీకి వచ్చే నెలసరి కార్యక్రమం అని తెలియజేస్తూ  గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి వివరంగా చెప్పారు.

చదువు విషయంలో తాము అనుకున్న గోలునుజాగ్రత్తగా సాధించడానికి కృషి చేస్తూ దృష్టిని ఎటు సారించకుండా బాలురైన బాలికలైన తాము క్రమశిక్షణతో ఉంటూ తన యొక్క గోల్డ్ సాధించడమే లక్ష్యంగా చదువుకోవాలని ఆరోగ్యం పై దృష్టి పెడుతూ ఉండాలని తెలియజేశారని క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ పాకాల నరసింహారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రొటేరియన్ రంజిత్ సింగ్, గంజి రమేష్, శంకర్, రితేష్ సక్సేన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -