- Advertisement -
క్విజ్ ఉపన్యాసం చిత్రలేఖన పోటీలు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం 26 నవంబర్ రోజు జరుపుకునే భారత రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యత గురించి ప్రిన్సిపాల్ వివరిస్తూ పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం పై పిల్లలకు క్విజ్, ఉపన్యాసం, చిత్రలేఖ పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, కంచరి రవికుమార్, బాలరాజు గౌడ్ , సాదిక, సుదర్శన్, శంకర్, సత్యం నజీర్, గంగరాజు, రహీం తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



