ఎస్పీ శ్రీనివాసరావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ద్వారా అంగీకరించబడింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవం ద్వారా ప్రజలకు రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలపై అవగాహన కల్పించడం లక్ష్యం. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.శంకర్ గారు పోలీసు సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అదనపు ఎస్పీ లతో పాటు, ఆర్ఐలు వెంకటేష్, ఆరిఫ్, సి.సి.ఎస్. సి.ఐ. రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎస్సై రామకృష్ణ, ఐటి సెల్ ఎస్సై సుకూర్, డి.పి.ఓ. సిబ్బంది మరియు జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



