గద్వాల బ్రాంచ్ కార్యదర్శి బంగి రంగారావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను వ్యతిరేకిస్తున్నట్లు గద్వాల ఎల్ఐసి బ్రాంచ్ కార్యదర్శి బంగి రంగారావు తెలిపారు. గద్వాల ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో డెమోని స్టేషన్స నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వము ఉన్న ఫలంగా అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడులను ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్బంధంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ లేబర్ కోడులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేబర్ కోడులను నిరసిస్తూ బుధవారం దేశ వ్యాప్తంగా అన్ని కార్యాలయాల ముందు భోజన విరామ సమయం డెమోషన్ నిర్వహిస్తున్నది. అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడుల సారాంశాన్ని బట్టి చూస్తే, భవిష్యత్తులో స్థిరమైన ఉపాధి ఏమాత్రం ఉండదని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంత నైపుణ్యం కలిగిన నిరుద్యోగులను పేపర్ నాప్కిన మాదిరిగా పరిమిత కాలానికి ఉపయోగించుకొని సమాజం పైకి విసర్జించే ప్రక్రియ గా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో అప్రెంటీసుల పేరుతో తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఊబందుకున్నాయి. ఈ లేబర్ కోడలా ఆగమనం తర్వాత అనేక సంఘటిత రంగాల్లో కూడా ఈ రకమైన నియామకాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా సంఘటిత రంగాలన్నీ జవాబుదారితనం లేకుండా నిర్వర్యమై పోయే ప్రమాదం కూడా ఉంది. కార్మికులు మరియు ఎంప్లాయిస్ అని ఒక విపరీత ధోరణిలో కొత్తగా నామకరణం చేసి దానికి వేతన పరిమితిని విధించడం వెనుక ఉద్యోగులంతా సంఘటితం కాకుండా ఉండాలనే ప్రతిపాదన స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది పూర్తిగా వ్యతిరేకించ తగినది. చాలా ప్రమాదకరమైనది.
కార్మికులకు జన్మ హక్కుగా పరిగణించే సమ్మె హక్కును పూర్తిగా కాలరాశి, సమ్మె నోటీసును 15 రోజుల నుండి 60 రోజులకు పెంచి, సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కూడా కన్సలేటరీ మీటింగులని, అర్బి ట్రేడర్ మీటింగ్ లోనే పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల హక్కులపై ఏమాత్రం శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యం వహించాలని విధంగా ఈ లేబర్ కోడలు రూపొందించబడ్డాయి. సాంఘిక భద్రత యజమాన్యమే కల్పిస్తుందంటూ పేపర్ పైన ప్రకటిస్తూ దాని రూపకల్పనకు నిర్దిష్టమైన ప్రతిపాదన లేవి చేయలేదు అని రంగారావు గారు తెలియజేశారు. అదేవిధంగా మహిళలకు మేలు చేసేందుకే అన్ని వేళల వారి సేవలు ఉపయోగించుకుంటామని చెప్పే మాట వినక మహిళల పట్ల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది. రాత్రింబవళ్లు పని చేయించుకునే సంస్కృతి కేవలం మహిళలకే కాదు మిగతా అందరికీ కూడా నష్టదాయకమైనదే. కానీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే ప్రక్రియలో ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
బాల కార్మిక వ్యవస్థ రద్దు చేయాలని ఒకవైపు డిమాండ్ జరుగుతుంటే 14 ఏళ్ల పిల్లలు కూడా కార్మిక సంఘాల్లో సభ్యులుగా చేరవచ్చని కొత్త నిబంధన తీసుకొచ్చారు. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించే వారిలో కనీసం 50% ఆ సంస్థలో పనిచేస్తున్న వారై ఉండాలని నిబంధన ద్వారా తమ వాదనను వినిపించలేని వారి అసహాయతనుహేళన చేస్తున్నట్లే. అన్నిటికన్నా ప్రమాదకరమైనది. వంద మంది కన్నా ఎక్కువ వర్కర్స్ ఉన్నచోట వర్కర్స్ కమిటీ అని ఏర్పాటు చేస్తారట మరియు 20 మంది కన్నా ఎక్కువ వర్కర్లు ఉన్నచోట గ్రీవెన్స్ రెడ్రస్సులు కమిటీ ఏర్పాటు చేస్తారట. అయితే ఈ రెండింటికి చైర్మన్గా మాత్రం యజమాన్యం తరఫునుండి వ్యవహారిస్తారట. దీన్నిబట్టి లేబర్ కోడుల ద్వారా ముందుకొచ్చిన సంస్కరణలు ఎవరి ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాయో స్పష్టంగా అర్థం అవుతలేదు. అందుచేత 100 సంవత్సరాలు అనేకమంది త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి కేవలం కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్బంధంగా ఖండిస్తుంది కూడా వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రంగారావు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు నర్సింగ్ ప్రధాన కార్యదర్శి బి రంగారావు రాఘవేంద్ర, సూరజ్, శివశంకర్, ఉదయ్ కుమార్, మనీష్, సుదర్శన్ శెట్టి, శైలేష్, కృష్ణ చైతన్య, లక్ష్మీకాంత్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.



