ప్రమాదంలో కార్మికులు చనిపోతే 10 లక్షల ఆర్థిక సాయం
వెల్ఫేర్ బోర్డు ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా లేబర్ అధికారి జె.రాజ్ కుమార్
నవతెలంగాణ – అచ్చంపేట
జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న ప్రతి కార్మికులు తెలంగాణ లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు తీసుకోవాలని, వెల్ఫేర్ బోర్డులు చదివేదం చేసుకోవాలని జిల్లా లేబర్ అధికారి జే రాజ్ కుమార్ కార్మికులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేస్తున్న పలు పథకాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న వెల్ఫేర్ బోర్డులోని కొన్ని నిబంధనలు సడలిచ్చిందన్నారు.
గతంలో ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే రూ 6 లక్షల 30 వేల మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చేది. సడలించిన నిబంధనల ఆధారంగా ప్రస్తుతం ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే రూ. 10 లక్షలకు పెంచారు. కార్మికులు గతంలో సహజ మరణానికి లక్ష 30.వేలు నుంచి రూ 2. లక్షలకు పెంచడం జరిగిందన్నారు. అంగవైకల్యం చెందుతే ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీంతోపాటు ఇన్సూరెన్స్ కార్డు ఉన్న ప్రతి కార్మిక కుటుంబానికి ఇంట్లో రెండు పెళ్లిళ్లకు 30 వేలు చొప్పున,రెండు డెలివరీలకు 30. వేలు చొప్పున లేబర్ శాఖ నుండి ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన 59 సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఈ ఇన్సూరెన్స్ కార్డు పొందాలని సూచించారు. ఇన్సూరెన్స్ కార్డు కోసం మద్యత లారీలను పైరవీకాలను ఆశ్రయించవద్దని, నేరుగా జిల్లా లేబర్ కార్యాలయానికి వచ్చి లేబర్ కార్డు పొందే విధానం తెలుసుకొని నేరుగా కార్మికులే లేబర్ కార్డు పొందవచ్చు అన్నారు.
గతంలో రెన్యువల్ కాకుండా ల్యాబ్స్ అయినటువంటి ఇన్సూరెన్స్ కార్డులకు కూడా ఆఫీస్ దగ్గర సహకారం తీసుకొని రెన్యువల్ చేయించుకోవచ్చు బహనిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నానని, దీనిని జిల్లాలోని లక్షలాదిమంది భవనిర్మాణ కార్మికులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, కల్వకుర్తి లేబర్ ఆఫీసర్ భవన నిర్మాణ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు సత్యం, టౌన్ గౌరవ అధ్యక్షులు గట్టు శ్రీను, ఆనందు, రఘు, సిమయ్య, జానకి రాముడు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.



