Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంమ‌రో 41 మంది మావోయిష్టులు లొంగుబాటు

మ‌రో 41 మంది మావోయిష్టులు లొంగుబాటు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మావోయిస్టు పార్టీకి మరో 41 మంది మావోయిష్టులు బీజాపూర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు సహా 29 మంది పురుష మావోయిస్టులు ఉన్నారన్నారు. లొంగిపోయిన వారిలో కీలక పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) నంబర్ వన్ బెటాలియన్, వివిధ ఏరియా కమిటీలు, ప్లాటూన్లు, కంపెనీ, మిలీషియా యూనిట్ల సభ్యులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఇదివరకే మావోయిస్టులు పార్టీకి చెందిన కొంతమంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో పాటు పలువురు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటివరకు జిల్లాలో 790 మంది మావోయిస్టులు ప్రధాన జీవన స్రవంతిలో చేరారని, 1031 మందిని అరెస్టు చేశామని, వివిధ ఎన్‌కౌంటర్లో 202 మంది మావోయిస్టులు మృతి చెందారని ఎస్పీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -