నవతెలంగాణ – జన్నారం
భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి, స్వీకరించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకునే రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రాథమిక పాఠశాల, పొనకల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పాటించారు. మువ్వన్నెల పతాకాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు రాజ్యాంగం ప్రాముఖ్యతను, రచనా క్రమాన్ని, ఆశయాలను విద్యార్థులకు తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మూల రేణుక, ఉపాధ్యాయులు కస్తూరి శ్రీకాంత్, బి. వనిత పాల్గొన్నారు.
జన్నారంలో రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలో బుధవారం దళిత సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల ఏఎంసీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ గౌరవించాలన్నారు. నాయకులు ఇందయ్యా, ప్రవీణ్ ప్రశాంత్ రాజన్న లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సంవిధాన్ దివస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



