Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగులకు జిల్లా స్థాయి పోటీలు: కలెక్టర్

దివ్యాంగులకు జిల్లా స్థాయి పోటీలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ,శిశు,దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఈ నెల 29-11-2025 తేదీన ఇండోర్ స్టేడియం, చింతలపేట, గద్వాలలో నిర్వహించబడనున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో జూనియర్ (18 సంవత్సరాల లోపు) సీనియర్ (18 నుండి 54 సంవత్సరాలు) వయో వర్గాల వారీగా పురుషులు, మహిళలు, బాలురు, బాలికలు పాల్గొనగలరని తెలిపారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం షాట్ పుట్, రన్నింగ్,చెస్ క్రీడలు,వినికిడి లోపం ఉన్నవారి కోసం షాట్ పుట్ జావెలిన్ మరియు రన్నింగ్ క్రీడలు, శారీరక దివ్యాంగుల కోసం షాట్ పుట్, జావెలిన్ త్రో,క్యారమ్ మరియు మానసిక దివ్యాంగుల కోసం షాట్ పుట్ ,రన్నింగ్ పోటీలు నిర్వహించబడనున్నాయని తెలిపారు.

జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించిన వారు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని పొందగలరని కలెక్టర్ పేర్కొన్నారు.పోటీల్లో పాల్గొనదలచిన దివ్యాంగులు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు,దివ్యాంగుల సర్టిఫికేట్లను తమతో తీసుకొని 29-11-2025 ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల లోపు ఇండోర్ స్టేడియం, చింతలపేట,గద్వాల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని దివ్యాంగుల సంఘాలు (PwD Unions) తమ సంస్థలను అధికారికంగా శాఖలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని సంఘాలు తమ రిజిస్ట్రేషన్ ధృవపత్రాల ప్రతులు మరియు సంఘంలోని కార్యవర్గ సభ్యుల వివరాలను 29-11-2025 లోపు జిల్లా మహిళా,శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమాధికారి కార్యాలయం, రూమ్ నం.జి -33 లో సమర్పించాలన్నారు.నమోదు చేసుకున్న సంఘాలకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహించే సమన్వయ సమావేశాలు మరియు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు మరియు దివ్యాంగుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -