– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాల్లోనీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింతా రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని కోనాపూర్, కొత్తచెరువు తండా గ్రామ పంచాయతీలలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.పోలింగ్ కేంద్రాలను ఒక్కొక్కటిగా సందర్శించి, అక్కడి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా, టాయిలెట్ సదుపాయాలు వంటి అంశాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమయానుకూలంగా పూర్తి చేయాలని సిబ్బందినీ ఆదేశించారు.అయన వెంట మండల పంచాయతీ అధికారి సదాశివ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, బూత్ లెవెల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఓటర్లకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



