- Advertisement -
పెద్ద తడగూర్ కొండవార్ రాజు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాలు నచ్చక పోవడమే ఓ బి సి మండల అధ్యక్ష పదవికి అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పెద్ద తడగూర్ కొండ వార్ రాజు ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జుక్కల్ నియోజకవర్గానికి తోట లక్ష్మి కాంతారావు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి ఎంతగానో కృషి జరుగుతుందని తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాలు నచ్చకపోవడమే తాను రాజీనామాకు సిద్ధమైనట్లు వెల్లడించారు. రాజీనామా లేఖను మండల పార్టీ అధ్యక్షునికి పంపుతున్నట్లు విలేకరులకు తెలిపారు.
- Advertisement -



