Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంరాజ‌స్థాన్‌లో అగ్ని ప్ర‌మాదం.. ఈవీ వాహ‌నాలు ద‌గ్ధం

రాజ‌స్థాన్‌లో అగ్ని ప్ర‌మాదం.. ఈవీ వాహ‌నాలు ద‌గ్ధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాజ‌స్థాన్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. కోటాలోని ఓ ఎల‌క్ట్రిక్ షోరూంలో ప్ర‌మాద‌వ‌శాత్తు మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో 50పైగా ఈవీ వాహ‌నాలు మంట‌ల్లో ద‌గ్ధమైయ్యాయి. శ‌ర‌వేగంగా మంట‌లు విస్తారించ‌డంతో ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీగా పొగ‌లు క‌మ్మేశాయి. దీంతో స్థానికులు భ‌యాందోళ‌న‌తో ప‌రుగులు తీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. నాలుగు ఫైర్ ఇంజ‌న్లు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నాయి. భారీగా ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను అదుపు చేయ‌డానికి ఫైర్ ఇంజ‌న్లు ప‌లు గంట‌ల‌పై శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చాయి. పోలీసుల ప్రాథమిక స‌మాచారం ప్ర‌కారం షాట్ స‌ర్య్కూట్ కార‌ణంగానే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని భావిస్తున్నామ‌ని తెలిపారు.

మంట‌ల్లో అనేక ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు నిర్ధారించారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా మ‌రిన్ని వివ‌రాలు తెలుస్తాయ‌ని చెప్పారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -