Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 

- Advertisement -

రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన దొంతుల 
నవతెలంగాణ – టేకుమట్ల 

కుల, మతం మనిషికి మనిషికి అసమానతలను తొలగించాలని సంకల్పంతో భారత దేశ ప్రజలందరికీ సమానత్వం, సమానఫలాలను కల్పించడానికి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ గ్రంధాన్ని ఆమోదించబడిన రోజును అంబేద్కర్ యువజన సంఘం భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి అరకొండ రాజయ్య ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు దొంతుల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒకే ఒక్క పెన్ను పోటుతో కులం, మత, లింగ అసమానత అడ్డుగోడలను బద్దలు కొట్టి భారతీయులందరూ సమానమే అందరికీ ఆర్థిక సమానత్వం కలగాలని షెడ్యూల్ కులాలకు, తెగలకు, బడుగు బలహీన వర్గాలకు   రిజర్వేషన్లను కల్పించి, స్వతంత్ర జాతి అన్న నూతన ధర్మాన్ని ఆవిష్కరించిన గ్రంథమే మన భారత రాజ్యాంగం అని, అది కేవలం ఒక పుస్తకం కాదు ప్రజల విశ్వాసానికి, పాలన విలువలకు మన రాజ్యాంగం ప్రతిరూపం. అది మన ఆశల శౌధం, సనాతన ధర్మాన్ని పక్కకుపెట్టి పవిత్రమైన రాజ్యాంగ గ్రంధాన్ని రాజ్యాంగ సభలో ఏకగ్రీవ అంగీకారంతో ఆమోదించుకున్న శుభదినం నవంబర్ 26 అని తెలిపారు. ప్రతి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రజలందరూ ఒక పండుగలాగా వేడుకను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మారపల్లి కొమురయ్య,అంబాల రమేష్, అబ్బెంగుల రాజయ్య, రాకేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -