Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – కట్టంగూర్
పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల బిల్లులు, పెన్షనర్లకు సంబంధించిన బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. యుటిఎఫ్ కట్టంగూరు మండల మహాసభ బుధవారం జిల్లా కేంద్రంలోని యుటిఎఫ్ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మురళయ్య పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -