నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
భారత రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకు సమర్ధవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నా అనంతరం పోలీసు అధికారులు,సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని చెప్పారు. ప్రజల రక్షణ,శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో బాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభంగా నిలవడమే కాక ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా నిలవడంలో భారత రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.ఐ లు రవి,మధుకర్ ఆర్.ఐ యాదగిరి,అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ,ఎస్.ఐ లు కిరణ్, జ్యోతి,సాయి కిరణ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



