Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం

రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం

- Advertisement -

అడిషనల్ యస్పి రమేష్ 
జిల్లా పోలీస్ కార్యాలయంలో  భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం, ప్రతి పౌరుడు దాని స్ఫూర్తిని కాపాడే బాధ్యత వహించాలని సూచించారు. భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా యస్పి సూచన మేరకు బుధవారం అడిషనల్ యస్పి రమేష్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ యస్పి మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పోలీసుల ప్రాధాన్యత ఎంతో విశిష్టమని, ప్రజల భద్రత, చట్ట అమలు, శాంతి పరిరక్షణలో పోలీసులు కీలక భూమిక వహిస్తున్నారని పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ, రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలనే ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.బి డియస్పి మల్లారెడ్డి, ఏ.ఓ శ్రీనివాసులు,ఆర్.ఐ లు సంతోష్, శ్రీను, , సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -