నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సమక్షంలో జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ ప్రతిజ్ఞ చేశారు.
“భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ ,సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ- న్యాయాన్ని , భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో కూడిన – స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, అంతస్తులోనూ, అవకాశంలోనూ – సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, దేశ సమగ్రతను, తప్పక తీసుకొచ్చే శోభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని, రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడి, చట్టబద్ధం చేసుకుని మాకు మేము సమర్పించుకుంటు, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, ఏఓ జగన్మోహన్ ప్రసాద్ , వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.



