మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్దతడగూర్ గ్రామానికి చెందిన కొండవార్ రాజు కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మద్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్‌వార్ సాయిలు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నిర్ణయాలు, విధానాలకు విరుద్ధంగా పనిచేసే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని, పార్టీ శ్రేణులలో అనుశాసనం కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షులు దరాస్‌వార్ సాయిలు పేర్కొన్నారు. పత్రిక ప్రకటనలో పాల్గొన్న వారిలో ఆలయ చైర్మన్ రామ్ పటేల్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విట్టల్ గురిజి, హన్మాండ్లు స్వామి, ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కొండవార్ రాజు సస్పెండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


