– ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం
– హాజరైన చైర్మన్ రాఘవరెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఆయిల్ ఇయర్ (2025 నవంబర్ – 2026 అక్టోబరు ) పామాయిల్ గెలలు ధర నిర్ణయం పై వ్యవసాయ, ఉద్యాన రాష్ట్ర స్థాయి అధికారులతో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి రైతు ప్రతినిధులతో హైద్రాబాద్ బుధవారం సమావేశం అయ్యారు. నూనె పై ఓఈఆర్ 20.01 శాతం,గింజలు పై 10.08 శాతం తో టన్ను గెలలు ధర చెల్లించాలని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ కు రైతు ప్రతినిధి ఆలపాటి రామచంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేసారు.గింజలు పైనే కాకుండా గింజలు నుండి తీసే ఆయిల్ పైన ధర చెల్లించాలని ప్రతిపాదన చేసారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా,జీఎం సుధాకర్ రెడ్డి,ఉద్యాన శాఖ జేడీ సరోజిని,రైతులు బండి భాస్కర్,కౌతా మహేష్,జ్యోత్స్న,ప్రభాకర్ లు పాల్గొన్నారు.
గెలల ధర నిర్ణయం.. ఓఈఆర్ 20.01 కు అంగీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



