– అటవీ పరిశోధనా స్థానం సందర్శన
– సమగ్ర ఉద్యాన అభివృద్ధి తోనే జాతీయ ఆర్థిక పురోగతి
– శాస్త్రవేత్త డాక్టర్ సీ.రవీంద్రన్ వెల్లడి
నవతెలంగాణ – అశ్వారావుపేట
సమగ్ర ఉద్యాన అభివృద్ధి తోనే జాతీయ ఆర్ధిక పురోగతి ఉంటుందని కొడైకెనాల్ ఉద్యాన,అటవీ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సీ.రవీంద్రన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్ధులు ఈ నెల 23 వ తేదీ నుండి డిసెంబర్ 3 వ తేదీ వరకు పదిరోజులు పాటు చేపట్టిన దక్షిణభారత విజ్ఞాన యాత్రలో భాగంగా 4 వ రోజు బుదవారం తమిళనాడు లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన
కొడైకెనాల్ ఉద్యాన పరిశోధనా స్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1961 సంవత్సరంలో ఏపిల్ సాగు,అభివృద్ది పై పరిశోదన చేసేవారు అని, 1971 సంవత్సరంలో హెచ్ఆర్ఎస్ (ఉద్యాన పరిశోదన స్థానం)గా అనంతర కాలంలో హెచ్ఎఫ్ఆర్ఎస్ ( ఉద్యాన,అటవీ పరిశోధనా స్థానంగా ) పురోభివృద్ధి చేసారని,దీని చరిత్ర,ఇందులో జరిగే పరిశోధనలు గురించి వివరించారు.
ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పియర్, ప్లమ్స్, పీచెస్,కివి వ్యాప్తిని విస్తరించడం,టెంపరేట్ హాల్టీకల్చర్ క్రాప్స్ పైన పరిశోదన చేసే ఏకైక స్థానం అని తెలిపారు.ఇక్కడ లావీండర్, జిరానియమ్,రోజ్ మేరే, డ్వార్ఫ్ యూకలిప్టస్ వంటి ప్లాంటాగ్ పదార్ధాలను పండిస్తున్నారు.ఇక్కడ వివిధ పరిశోధనలతో పాటు ఉద్యాన పండ్ల తోటల్లో చేసే యాజమాన్య పద్ధతులు,నర్సరీల పెంపకంపై శిక్షణ,యువత కు పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ శిక్షణలు ఇస్తారు.
ఆ తరువాత బ్రిటిష్ కాలంలో అభివృద్ది చేసిన పైన్ అడవి ఇప్పుడు పర్యటక ప్రదేశంగా ఉంది. గుణ గుహలు వీక్షించారు. 102 మంది విద్యార్ధులు పాల్గొనే ఈ విజ్ఞాన యాత్రకు టూర్ లీడర్ లుగా స్థానిక వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ టీ. శ్రావణ కుమార్, డాక్టర్ కే. శిరీష్,డాక్టర్ శ్రీ జన్, స్రవంతి లు వ్యవహరిస్తున్నారు.



