Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మండల పరిధిలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలుర కళాశాల కాటారంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జయశంకర్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి టి. హరిసింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు రాజ్యాంగం గురించి క్లుప్తంగా వివరించారు. ఈ గ్రంథ రచయిత డా.బి. ఆర్.అంబేద్కర్ గురించి, రాజ్యాంగం అవశ్యకత గురించి అర్థమయ్యే విధంగా ఆయన విద్యార్థులకు వెల్లడించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ రాజేందర్ మాట్లాడుతూ.. మన రాజ్యాంగం భారతదేశ పరిపాలన వ్యవస్థకు దిక్సూచి లాంటిది అని అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం భారత రాజ్యాంగమే అని కొనియాడారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగ గ్రంథాన్ని తప్పక చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల ఉపన్యాసాలు అంబేద్కర్, రాజ్యాంగంపై పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ .టి. హరిసింగ్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూ. వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, డి వార్డెన్ బలరాములు, రాజబాబు, కృష్ణమాచారి నీలిమ, స్వప్న, గోపాలకృష్ణ , శ్రవణ్ నరసింహ, సర్దార్సింగ్, పీడీ మహేందర్ పి ఇ టి శ్రీనివాస్, కోచ్ వెంకటేష్ , ప్రీతి, ఏఎన్ఎమ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -