Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయందేశంలోనే అత్యంత ఖ‌రీదైన నంబర్ ప్లేట్

దేశంలోనే అత్యంత ఖ‌రీదైన నంబర్ ప్లేట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు తాజాగా హర్యానాలో నమోదైంది. తాజాగా నిర్వహించిన VIP నంబర్ ప్లేట్‌ల ఆన్‌లైన్ వేలంలో ‘HR88B8888’ అనే నంబర్ రూ. 1.17 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడబోయింది. బుధవారం ముగిసిన ఈ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీలో పాల్గొన్నారు. రూ. 50,000 బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ఈ నంబర్ ధర నిమిషానికోసారి పెరుగుతూ చివరకు కోట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ధర రూ. 88 లక్షలకు చేరగా.. సాయంత్రం 5 గంటలకు రూ. 1.17 కోట్ల వద్ద వేలం ముగిసింది.

ఇందులో HR అంటే హర్యానా రాష్ట్ర కోడ్, 88 అంటే RTO కోడ్, B వాహన సిరీస్, 8888 ప్రత్యేక నాలుగు అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మొత్తం నంబర్ ప్లేట్ ఎనిమిదుల వరుసలా కనిపించడం దీనిని అత్యంత విలువైనదిగా మార్చింది. మొత్తానికి ‘HR88B8888’ నంబర్ ప్లేట్ రూ. 1.17 కోట్ల ధరకు అమ్ముడవడం భారతదేశంలో VIP నంబర్లకు ఉన్న పెరుగుతున్న డిమాండ్‌కి ఉదాహరణగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -