- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ మొదటి విడత ఎలక్షన్ లలో భాగంగా పస్రా,గోవిందరావుపేట,చల్వాయి, దుంపెల్లిగూడెం మరియు కర్లపల్లి నామినేషన్ దాఖలు కేంద్రాలను బుధవారం పస్రా సీఐ పి దయాకర్, పస్రా ఎస్ఐ ఏ కమలాకర్ సందర్శించి నామినేషన్ కి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సిబ్బంది కి తగు సూచనలు చేయడం జరిగింది. నామినేషన్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కావున స్థానిక ప్రజలు నాయకులు గుంపులు గుంపులుగా ఉండకూడదని, నినాదాలు ధర్నాలు చేయకూడదని అన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని అన్నారు.
- Advertisement -



