- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్ పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయానికి మూలాధారమైన భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, రాజ్యాంగ వారసత్వం, స్ఫూర్తిని కొనసాగిస్తూ విలువలను కాపాడుతూ సమ్మిళిత, సుసంపన్నమైన ప్రగతిశీల భారతవనిని నిర్మించాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రజాస్వామ్య స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బి.వెంకటి, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


