Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో కిచెన్ గార్డెన్ కోసం ఏర్పాట్లు

పాఠశాలలో కిచెన్ గార్డెన్ కోసం ఏర్పాట్లు

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న తెలిపారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో ఓ ప్రక్కన స్థలాన్ని ఎంపిక చేసి, కిచెన్ గార్డెన్ కోసం స్థలాన్ని కూలీలతో శుభ్రం చేయించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఎంపిక చేసిన స్థలంలో వివిధ రకాల కూరగాయల మొక్కలను నాటనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -