Wednesday, November 26, 2025
E-PAPER
Homeసినిమాఒక్క రోజులో జరిగే కథ

ఒక్క రోజులో జరిగే కథ

- Advertisement -

హీరోయిన్‌ కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రివాల్వర్‌ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిసామి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ మాట్లాడుతూ,’అజరుతో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.సునీల్‌ చాలా డిఫరెంట్‌ రోల్‌ చేశారు. రాధిక చాలా చక్కని పాత్ర చేశారు. ఇది పర్ఫెక్ట్‌ డార్క్‌ కామెడీ ఫిలిం. ఇప్పటివరకు చాలా డార్క్‌ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ ఇది ఫిమేల్‌ లీడ్‌ చేస్తున్న డార్క్‌ కామెడీ సినిమా. ఇది ఒక్క రోజులో జరిగే కథ. చాలా అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. చంద్రు ఈ సినిమాని పక్కా కమర్షియల్‌ సినిమాగా తీశారు. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. వాళ్ళు ‘మహారాజా’ లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. ఈ సినిమాని తెలుగు, కన్నడలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న కుమార్‌కి ధన్యవాదాలు’ అని తెలిపారు.
‘ఇది చాలా మంచి సినిమా. కీర్తి అద్భుతంగా చేశారు. ఈ సినిమాని చూశాను. చాలా బాగుంది. ఆంధ్ర, తెలంగాణలో రిలీజ్‌ చేసుకునే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’ అని డిస్ట్రిబ్యూటర్‌ కుమార్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -