– బలవంతంగా శ్రామికశక్తిలోకి మహిళలు
– మేడిపండు చందంగా గ్రామీణ మహిళల ఉపాధి
– పనుల్లేక, కనీస వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతం
– సామాజిక భద్రత కరువు…స్థిరమైన ఉద్యోగాలు లేవు
– వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్న ప్రభుత్వాలు
దేశంలోని శ్రామికశక్తిలో గ్రామీణ మహిళల సంఖ్య, వారి పాత్ర గణనీయంగా పెరిగిందని మోడీ సర్కారు చెప్పుకుంటున్నది. ఇది తమ ప్రభుత్వ ఘనతే అని ప్రచారం చేసుకుంటున్నది. దీనిని తమ విజయాల జాబితాలో వేసుకుంటున్నది. అయితే ఈ గణాంకాల వెనుక బయటకు కనబడని చేదు వాస్తవాలున్నాయని మేధావులు చెప్తున్నారు. దేశంలో గణనీయమైన సంఖ్యలో మహిళలు చాలీచాలని జీతాలు, భద్రత కరువైన పని పరిస్థితుల నడుమ అతి బలవంతంగా శ్రామిక శక్తిలో చేరుతున్నారని అంటున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లోని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) గణాంకాలు గ్రామీణ మహిళలు భారీగా శ్రామిక శక్తిలోకి వచ్చారని చెప్తున్నాయి. అయితే మహిళల సంఖ్య పెరగటమంటే.. దేశ వాస్తవ వృద్ధి, మహిళా సాధికారతకు సంకేతమా? లేక కుటుంబ ఆర్థిక ఒత్తిడి పరిస్థితుల నడుమ శ్రామిక శక్తిలోకి రావటంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామీణ మహిళల వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) 35 శాతం నుంచి 38 శాతానికి పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. దీనర్థం ఉపాధి అవకాశాలు పెరిగాయని కాదు.. గృహ ఆదాయం పడిపోవడంతో మహిళలు పని చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మోడీ సర్కారు చెప్పుకునే ఈ ‘గొప్ప పెరుగుదల’లో అనేక చేదు వాస్తవాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మహిళలకు స్థిరమైన జీతాలు లేవు. సామాజిక భద్రత కరువైంది. రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులు నీటి మీద రాతల్లా మారాయి. ఇక పనిలో గౌరవానికి నోచుకోలేకపోతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు మహిళలను మానసికంగా, శారీరకంగా కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా మహిళలకు ఉపాధి ఉన్నా.. అందులో గౌరవం లేదని మేధావులు వివరిస్తున్నారు. మహిళలు అధికంగా స్వయం ఉపాధి, వ్యవసాయ సహాయక పని వంటి వాటిలో ఉన్నారు. అయితే ఇది అభివృద్ధికి సూచిక కాదనీ, పేదరికం మహిళల భుజాలపై మరింతగా బరువు పెడుతున్నదనడానికి ఒక సంకేతమని వారు అంటున్నారు.
గ్రామీణ మహిళల ఉపాధి పెరుగుదలను అభివృద్ధిగా చూడొద్దనీ, దీనిని గ్రామీణ సంక్షోభానికి మరో లక్షణంగా భావించాలని అంటున్నారు. స్థిరమైన ఉద్యోగాలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత, హక్కులు… ఇవే మహిళా సాధికారతకు నిజమైన ప్రమాణాలని మేధావులు చెప్తున్నారు. అవి లేనంతకాలం ప్రభుత్వం చెప్పే ‘విజయం’ కాగితాల మీదే ఉంటుందని అంటున్నారు.
స్థిరమైన ఉపాధి అవకాశాలేవీ?
దేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) వంటి కేంద్ర పథకాలు మహిళల జీవితాలను మెరుగుపర్చాయన్న ప్రచారం బలంగా ఉన్నది. వాస్తవానికి ఈ పథకాలపై మహిళలు ఆధారపడటం పెరిగిందంటే..
మహిళల భుజాలపై భారం
కేవలం గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంటున్న ప్రభుత్వాలు… వాటి వెనుక ఉన్న వాస్తవాలను దాచిపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సురక్షిత ఉపాధి తగ్గింది. జీతభత్యాలు క్షీణించాయి. కుటుంబ ఆదాయాల పతనం కారణంగానే శ్రామికశక్తిలో మహిళల ‘బలవంతపు’ ప్రవేశం జరుగుతోందని మేధావులు ఆరోపిస్తున్నారు. ఇది మహిళా సాధికారత కాదనీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మహిళల భుజాలపై పడుతున్న భారమని అంటున్నారు. ఇక అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) చెప్పే ‘మానవ గౌరవం కలిగిన పని’ భారతీయ గ్రామీణ మహిళలకు ఇప్పటికీ అందని ద్రాక్షే అని వివరిస్తున్నారు.
ఇతర స్థిరమైన ఉపాధి అవకాశాలు పూర్తిగా నశించాయని అర్థమని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు.. ఏడాదిలో వంద రోజులు ఉపాధి లభించినా.. మిగతా 265 రోజులు నిరాశేనని అంటున్నారు. ఇక స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)లలో పది కోట్ల మంది మహిళలు ఉన్నారంటే దానర్థం మహిళలకు బ్యాంక్ లోన్లు తప్ప స్థిరమైన ఆదాయ మార్గాలు లేవని భావించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో మహిళలకు దారులు మూసుకుపోయినందుకే మహిళలు ఈ పథకాలపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మేధావులు అంటున్నారు.
బతుకుపోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



