ఏఐఐఈఏ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) డిమాండ్ చేసింది. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకరంగా బుధవారం దేశవ్యాప్తంగా భోజన విరామ సమయంలో అన్ని కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లతో యువతకు భవిష్యత్తులో స్థిరమైన ఉపాధి దొరకదని తెలిపింది. ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా ఎంతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులను పేపర్ నాప్‌కిన్ మాదిరిగా ఉపయోగించుకునే చర్యలను ఖండించింది. ఇప్పటికే కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్‌ల పేరుతో తాత్కాలిక ఉద్యోగుల నియామకాలను చేపట్టిందని విమర్శించింది. లేబర్ కోడ్‌లతో అనేక సంఘటిత రంగాల్లో తాత్కాలిక నియామకాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిం ది. సంఘటిత రంగాలన్నీ వాటంతట అవే నిర్వీర్యమై పోయే ప్రమాదముందని పేర్కొంది. కార్మికుల జన్మహక్కుగా పరిగణించే సమ్మె హక్కును పూర్తిగా కాలరాసిందని తెలిపింది. సమ్మె నోటీసులను 15 రోజుల నుంచి 60 రోజులకు పెంచడం ద్వారా కన్సిలియేటరీ సమావేశాలు, ఆర్బిట్రేటర్ సమావేశాలతోనే పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల హక్కులపై హరిస్తున్నదని తెలిపింది. సాంఘిక భద్రత యాజమాన్యమే కల్పిస్తుందంటూ కేంద్రం చెప్పినా, నిర్దిష్ట కార్యాచరణ లేదని విమర్శించింది. మహిళలకు మేలు చేసేందుకే అన్ని సమయాల్లో వారి సేవలను ఉపయోగించుకుం టామనడం వారి పట్ల నిర్లక్ష్య వైఖరే అని అభిప్రాయపడింది. రాత్రింబవళ్లు పని చేయించుకునే సంస్కృతి కేవలం మహిళలకే కాదనీ, మిగతా అందరికి కూడా నష్టదాయకమైనదేనని వ్యాఖ్యానించింది. కానీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే ప్రక్రియలో ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేసింది. బాల కార్మిక వ్యవస్థ రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో 14 ఏండ్ల పిల్లలను కూడా కార్మిక సంఘాల్లో సభ్యులుగా చేరవచ్చని కొత్త నిబంధన తీసుకరావడం అభ్యంతరకర మని తెలిపింది.అసంఘటిత రంగ కార్మికసంఘాలకు నాయకత్వం వహించే వారిలో కనీసం 50శాతం ఆ సంస్థలో పని చేస్తున్న వారే ఉండాలన్న నిబంధనతో వారి గొంతునొక్కడమేనని పేర్కొంది. 100 మంది కన్నా ఎక్కువ మంది కార్మి కులు ఉన్న చోట కార్మిక సంఘాన్ని కమిటీ ఏర్పాటు చేయాలనడం, అంత కంటే తక్కువ సంఘాన్ని ఏర్పాటు చేయకూడదనే నిబంధనతో శ్రామిక దోపిడీ పెరగ నుందని ఆందోళన వ్యక్తం చేసింది. కొంత మంది ఆర్థిక ప్రయోజనాల కోసమే లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శిం చింది. 100 ఏండ్లపాటు అనేక మంది త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా రద్దుచేసి కేవలం కార్పొ రేట్లకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకించింది. వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
నాలుగు లేబర్ కోడ్‌లు వెంటనే ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



