ఎస్టీ జనాభా తక్కువ ఉన్నా రిజర్వేషన్
తాత్కాలికంగా స్టే విధించిన కోర్టు
నవతెలంగాణ-ఏన్కూర్
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలకుగాను.. ఏన్కూరు, నాచారం, జన్నారం, ఆరికాయలపాడును మినహాయించి, మిగిలిన 21 పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహించనున్నా రు. ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ ఆయా గ్రామ పంచాయతీలను ఎస్టీ సామాజిక తరగతికి రిజర్వేషన్ చేయడంతో, సదరు గ్రామ పంచాయతీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏన్కూరు జీపీలో మొత్తం 3,203 మంది ఓటర్లకు.. ఎస్టీ ఓటర్లు 411 మంది మాత్రమే ఉండగా, జన్నారంలో మొత్తం 1,619 మంది ఓటర్లకు కేవలం 16 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. నాచారం జీపీలో 975 మంది ఓటర్లకు 433 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఆరికాయలపాడులో 676 మంది ఓటర్లకు కేవలం తొమ్మిది మందే ఎస్టీ ఓటర్లు ఉన్నారు. దీంతో ఆయా పంచాయతీలను మైదాన ప్రాంతాలుగా పరిగణించి, జనరల్ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించాలని గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనలు పరిశీలించిన న్యాయస్థానం, ఈ నాలుగు గ్రామ పంచాయతీలలోని రిజర్వేషన్ల ప్రక్రియపై తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో, అక్కడ ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. న్యాయస్థానం తుది తీర్పు తర్వాతే ఈ గ్రామాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఆ గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



