Thursday, November 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంధనిక దేశాల బాధ్యతారాహిత్యం

ధనిక దేశాల బాధ్యతారాహిత్యం

- Advertisement -

– క్లైమెట్‌ ఫండింగ్‌లో మొండిచేయి
– పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్ర నష్టం
– మాటలకే పరిమితం.. చేతలు శూన్యం

బ్రెజిల్‌లో జరిగిన కాప్‌30 సమావేశం పర్యావరణ మార్పులపై పోరాడేందుకు ఎన్ని నిధులు కావాలో స్పష్టం చేసింది. కానీ ఈ విషయంలో ధనిక దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం వాగ్దానాలకే పరిమితమవుతున్నాయి. నిధుల సమీకరణలో వెనుకడుగేస్తున్నాయి. ఈ తీరే ఇప్పుడు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాపంగా పరిణమించింది. ఉద్గారాలను విపరీతంగా విడుదల చేస్తున్న ధనిక దేశాలు.. ఫండింగ్‌ విషయంలో వెనుకాడటాన్ని నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నారు.

న్యూఢిల్లీ : పర్యావరణం రోజురోజుకూ ప్రతికూల మార్పులకు గురవుతున్నది. వరదలు, కరువు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు తీవ్రమవుతున్నాయి. కానీ ఈ సమస్యకు ప్రధాన కారణమైన ధనిక దేశాలు… పేద దేశాలకు కావాల్సిన నిధులు ఇవ్వడంలో ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై నిర్దేశించు కున్న లక్ష్యాలు కాగితాలకు, మాటలకే పరిమితమవు తున్నాయి. ఈ అసమానతే ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్రెజిల్‌లోని బెలెం నగరంలో కాప్‌30 అనే ఒక పెద్ద క్లైమెట్‌ సమావేశం జరిగింది. ఇది పారిస్‌ ఒప్పందానికి పదేండ్లు పూర్తయిన సందర్భంలో జరగటం గమనార్హం. ఈ సమావేశంలో కొన్ని మంచి నిర్ణయాలే తీసుకున్నా.. క్లైమెంట్‌ ఫైనాన్స్‌, అంటే పేద దేశాలకు ఇచ్చే నిధుల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. 2035 నాటికి ఏడాదికి 1.3 ట్రిలియన్‌ డాలర్ల భారీ మొత్తాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఏ దేశాలు ఎంత ఇస్తాయి? ఎప్పుడు ఇస్తారు? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు. ప్రపంచంలో 2023లో ఖర్చయిన క్లైమెట్‌ డబ్బు 1.9 ట్రిలియన్‌ డాలర్లు. అందులో పది శాతం మాత్రమే పేద దేశాలకు వెళ్లటం గమనార్హం.

ఉద్గారాల అసమానత
క్లైమెట్‌ ఫండింగ్‌ విషయంలో మొండిచేయి చూపిస్తున్న ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు… పర్యా వరణానికి వారి ద్వారా ఎదురవుతోన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాయి. అమె రికా, ఆస్ట్రేలియా, జపాన్‌ లలో ఒక్క వ్యక్తి నుంచి సగటున ఏడాదికి 8 నుంచి 17 టన్నుల కార్బన్‌ ఉద్గారాలు జరుగుతాయి. భారత్‌ వంటి దేశాల్లో ఇది 2.5 టన్నుల కంటే తక్కువే. అంటే ఎక్కువ కాలుష్యానికి కారణమవుతున్న ధనిక దేశాలు మాత్రం తక్కువ బాధ్యతను తీసుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త సహకారం అవసరం
ప్రపంచ పర్యావరణ విషయంలో అన్ని దేశాలూ ఒక సమన్వయంతో ముందుకు వెళ్లాలని వారు సూచిస్తున్నారు. ధనిక దేశాలు తమ బాధ్యతను పేద దేశాల మీద నెట్టివేయకూడదనీ, వాగ్దానా లను నిలబెట్టుకోవాలని నిపుణు లు అంటున్నారు. ముఖ్యంగా ‘పర్యా వరణానికి’ అవసరమైన నిధులను కేటా యించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ‘లాస్‌ అండ్‌ డ్యామేజ్‌’ (విపత్తులు) కోసం ఎక్కువ నిధులు ఇవ్వాలని అంటు న్నారు. ఇక పేద దేశాలు శక్తివంతమైన గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రాజెక్టులు రూపొందిం చాలని నిపుణులు చెప్తున్నారు. అలాగే తమకు వచ్చే ప్రతి రూపాయినీ జీవనోపాధి, పునరుద్ధరణ వంటి నిజమైన అవసరాలకు వినియోగించాలని మేధావులు, నిపుణులు సూచిస్తున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల కష్టాలు
భారత్‌లోని ఒక ప్రముఖ స్వతంత్ర పరిశోధనా సంస్థ (థింక్‌ ట్యాంక్‌) సీఈఈడబ్ల్యూ అధ్యయనం ప్రకారం.. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2035 నాటికి ఏడాదికి 3.2 ట్రిలియన్‌ డాలర్లు కావాలి. కానీ ఇప్పటి వరకు వచ్చిన నిధులు చాలా తక్కువ. ధనిక దేశాలు ఇప్పుడు తమ దేశాల్లోని ప్రజలను రక్షించటానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. కానీ ప్రపంచ పర్యావరణ రక్షణ విషయంలో మాత్రం తమకు సంబంధమే లేదన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇక పేద దేశాలలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. ప్రకృతి విపత్తు ద్వారా ఏదైనా ధన, ప్రాణ నష్టం జరిగితే.. అవి కోలుకోలేవు. వాటి ద్వారా కావాల్సిన మొత్తంలో నిధులూ ఉండవు. కాబట్టి క్లైమెట్‌ ఫైనాన్స్‌ అనేది దానం కాదనీ, ఇది ఒక న్యాయం, బాధ్యత అని నిపుణులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -