- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. నగరంలో గాలి నాణ్యత AQI (Air Quality Index) 351 వద్ద నమోదైంది. బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి, ఇతర ప్రాంతాలతో సహా ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలలో ఏక్యూఐ 300 కంటే ఎక్కువ నమోదైంది. దేశరాజధానిలో కాలుష్యం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే స్కూల్ పిల్లలను గ్రౌండ్లలో ఆడిపించవద్దని పాఠశాల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించాయి.
- Advertisement -



