నవతెలంగాణ-హైదరాబాద్: హాంగ్ కాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. బహుళ అంతస్తుల భవనాల్లో చెలరేగిన మంటలు అనేక మందిని బలితీసుకున్నాయి. 44 మంది సజీవ దహనమైయ్యారు. అలాగే 270 మంది మంటల్లో గల్లంతు అయ్యారు. అంతేకాకుండా ఆ మంటలు సమీపంలోని పలు భవనాలకు అంటుకున్నాయి. దీంతో భారీ మొత్తంలో ఆస్తినష్టం వాటిల్లింది. భారీగా చెలరేగిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది 20గంటలపైగా కష్టపడ్డారు. తాజాగా ఘోర ప్రమాదానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేసినట్టు సీఎన్ ఎన్ వెల్లడించింది. భవన నిర్మాణంలో ఆ ముగ్గురు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారని కథనాలు వెలువరించింది.
హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం..ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



