విచారించిన సిట్..రెండు గంటల పాటు ప్రశ్నలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న సిట్ మళ్లీ విచారణ ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్‌డీ రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు విచారిం చారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో గురువారం అతన్ని రెండు గంటల పాటు ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసు విచారణ ఏ దశలో ఉంది? ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. కేసు విచారణపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓఎస్‌డీని విచారించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు, నిందితులను ఇప్పటికే పలువిడతలుగా సిట్ విచారించింది. నలుగురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో ‘భారత రాష్ట్రసమితి సుప్రీం’ అనే పదాన్ని వాడారు. అంటే, కేసీఆర్ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు అప్పట్లో రాధాకిషన్‌రావు చెప్పా రనేవిధంగా రిమాండ్ రిపోర్టులో ఉంది.ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కు ఓఎస్‌డీగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డిని విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఓఎస్‌డీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



