హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు
నవతెలంగాణ-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామ సర్పంచ్ స్థానం రిజర్వేషన్లో నిబంధనలు పాటించలేదని, వెంటనే ఈ ఎన్నికలు నిలిపివేయాలని ఆ గ్రామానికి చెందిన మిట్టగడుపుల యాకోబ్, కాసోజు ఏకాంతచారి, సిలివేరు లింగయ్య, పోలు నాగయ్య, కాసోజు విజయకుమార్, బత్తుల వెంకటమల్లు డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్‌పై తాము హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ గ్రామంలో మహమూద్‌పట్నం గ్రామపంచాయతీలో మొత్తం 576 మంది ఓటర్లు ఉండగా 199 మంది ఎస్సీలు, 358 మంది బీసీలు, 13 మంది ఓసీలు, ఏడుగురు ఎస్టీకి చెందిన ఓటర్లు ఉన్నారన్నారు.
2017లో తమ గ్రామ పంచాయతీ నుంచి తౌరియా తండా భూక్యారాం తండాలు నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయని, 2019లో మహమూద్ పట్నం సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించినట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో తమ గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌గా ప్రకటించారన్నారు. వాస్తవానికి గ్రామంలో ఎస్టీ ఓటర్లు కేవలం రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మాత్రమే ఉన్నారని, వీరికి సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను కూడా రిజర్వేషన్ చేసినట్టు తెలిపారు. వాస్తవానికి 2011లోని ఎస్టీ ఓటర్లను కలుపుకొని 1332 మంది ఓటర్లు ఉన్నట్టుగా భావిస్తూ తమ గ్రామానికి ఎస్టీ రిజర్వ్ చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కులాల వారీగా ఓటర్ల జాబితాను పరిశీలించి రిజర్వేషన్లను పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు.
‘మహమూద్‌పట్నం’ ఎన్నికలు నిలిపేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



