బడ్జెట్ ముసాయిదాలో పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన
సోఫియా : బాల్కన్ దేశం బల్గేరియాలో వేలాదిమంది నిరసనకారులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. వచ్చే ఏడాది ప్రవేశ పెట్టె బడ్జెట్‌కు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో పన్నులను పెంచుతామని స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష వి కంటిన్యూ ది చేంజ్, డెమొక్రటిక్ బల్గేరియా పార్టీల ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్‌ను ముట్టడించారు. పార్లమెంట్ భవనం నుండి బయటకి ఎంపీలు రాకుండా, వాహనాలను లోపలకి వెల్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఘర్షణలు చెలరే గాయి. సోఫియా డైరెక్టరేట్ ఆఫ్ ఇంటీరియల్ (ఎస్‌డివిఆర్) పోలీసులు ఆందోళనాకారులు తమపై గాజు సీసాలు, రాళ్లతో దాడి చేశారన్నారు. అయితే పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, బాష్ప వాయువులను ప్రయోగించారని పలువురు విమర్శించారు. ప్రభుత్వం డివిడెంట్ పన్నులను పెంచడం ద్వారా సామాజిక భద్రత తగ్గిపోతుందని, వ్యాపారాలపై, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆ దేశ ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.
బల్గేరియాలో పార్లమెంట్ ముట్టడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



