నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇన్‌ఛార్జీ మంత్రి ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ NTPC వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు.. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది.. స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ క్యాంటీన్లల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు.. ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి మెట్రో పాలిటన్ నగరంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.



