Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల సంఖ్య, వివరాలు

గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల సంఖ్య, వివరాలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉన్నాయి. త్వరలోనే గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్నూర్ మండల పరిధిలోని గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు థర్డ్ ఫేస్ లో జరగనున్నాయి. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల సంఖ్య వివరాలు అధికారులు తెలిపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.

అంతాపూర్ గ్రామపంచాయతీలో 590, ఆవల్గావ్ గ్రామపంచాయతీలో 1276, చిన్న ఎక్లారా గ్రామపంచాయతీలో 1065, చిన్న తడగూర్ గ్రామపంచాయతీలో 997, దన్నూర్ గ్రామపంచాయతీలో 883, గోజేగావ్ గ్రామపంచాయతీలో 913, హెచ్ కెలూరు గ్రామపంచాయతీలో 1526, కొడిచెర గ్రామపంచాయతీలో 2133, లచ్చన్ గ్రామపంచాయతీలో1474, మద్నూర్ గ్రామపంచాయతీలో 7054, మేనూర్ గ్రామపంచాయతీలో 2094, పెద్ద ఎక్లారా గ్రామపంచాయతీలో 2290, రాచూర్ గ్రామపంచాయతీలో 291, రుశేగావ్ గ్రామపంచాయతీలో 590, పెద్ద షక్కర్గా గ్రామపంచాయతీలో 1939, చిన్న షక్కర్గా గ్రామపంచాయతీలో 1334, షేకాపూర్ గ్రామపంచాయతీలో 979, సోమూర్ గ్రామపంచాయతీలో 539, సుల్తాన్ పేట్ గ్రామపంచాయతీలో 1283, పెద్ద తడుగూర్ గ్రామపంచాయతీలో 2033, తడి ఇప్పరుగా గ్రామపంచాయతీలో 1382, ఓటర్లు ఉన్నట్లుగా మొత్తం 21 గ్రామపంచాయతీ పరిధిలో 32,669 ఓటర్లు ఉండగా వీటిలో పురుషుల ఓటర్ల సంఖ్య 16192 మహిళల సంఖ్య 16,477 ఓటర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -