- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
ప్రస్తుతం జరుగనున్న పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (పంచాయతీ రాజ్) భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో రైతువేదికలో నిర్వహించిన ఎన్నికల అధికారుల శిక్షణ తరగతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు బాధ్యతాయుతంగా పంచాయతీ ఎన్నికలను 100% పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జలంధర్ రెడ్డి, తహశీల్దార్ దశరథ, ఎంఈవో భాస్కర్ , ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



