Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా ఎన్నికల అబ్జర్వర్లుగా మల్లయ్య, శ్రీనివాసులు నియామకం

జిల్లా ఎన్నికల అబ్జర్వర్లుగా మల్లయ్య, శ్రీనివాసులు నియామకం

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి  
జిల్లాలో గ్రామ పంచాయతి ఎన్నికల అబ్జర్వర్లు గా మల్లయ్య బట్టు, శ్రీనివాసులను ప్రభుత్వం నియమించింది. వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, సవ్యంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య బట్టు ను కేటాయించింది. ఎన్నికల సందర్భంగా ఏవైనా ఫిర్యాదులు ఉంటే అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఎవరైనా  9110526278 కు సమాచారం ఇవ్వవచ్చని వనపర్తి జిల్లా సాధారణ పరిశీలకులు తెలిపారు. అలాగే జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నాగర్ కర్నూల్ జిల్లా ఆడిట్ ఆఫీసర్ యం. శ్రీనివాసులు ఫోన్ నెంబర్ 8712475079 ను కేటాయించింది. 

ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణములో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, ఎన్నికల సిబ్బంది అలసత్వానికి తావు లేకుండా కృషి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూం 08545-233525 నెంబరు ఫొన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. 

 వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. అభ్యర్థులు ప్రచారానికి చేసే ప్రతి పైసా షాడో టీమ్ ద్వారా లెక్కింపు చేయడం జరుగుతోందని, అన్ని మండలాల్లో ఎ.ఈ.ఓ లను నియమించడం జరిగిందని ఖర్చుకు సంబంధించిన వివరాలు ఏరోజుకు ఆరోజు  ఎ.ఈ.ఓ లకు పంపించాలని సూచించారు. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు, లిక్కర్ పట్టుబడితే సీజర్ టీమ్ కు అప్పగించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -