నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా వేదికగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ డ్రా విధానాన్ని ఇరాన్ దేశం బహిష్కరించింది. తమ దేశానికి చెందిన ఫిఫా ప్రతినిధుల బృందానికి యూఎస్ వీసాను నిరాకరించిందని, అందుకే ఆ కార్యక్రమానికి తమ దేశ ప్రతినిధులు హాజరుకావడంలేదని ఇరాన్ ఫిఫా ఫెడరేషన్ తెలిపింది. ఈ విషయాన్ని ఫిపాకు ప్రతినిధులకు తెలియజేశామని వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా క్రీడకు కెనడా, మెక్సికోతో కలిసి అమెరికా ఆతిధ్యం ఇవ్వనుంది.
అయితే, ఈ ఏడాది జూన్‌లో, అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా అణు ఆయుధాల సాకుతో ఇరాన్‌లోని పలు అణు కేంద్రాలపై యూఎస్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇరుదేశాల మధ్య 12 రోజులు యుద్ధం కొనసాగింది. దీంతో రెండు దేశాల మధ్య వైరం నడుస్తోంది. ఇరాన్‌పై పలు రకాల ఆంక్షలను డొనాల్డ్ ట్రంప్ విధించారు.



