Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాకు న్యాయం చేయండి

నాకు న్యాయం చేయండి

- Advertisement -

అత్తగారింటి ముందు కోడలు ధర్నా
చలిలో రాత్రి ఇంటి ముందే నిద్ర
మద్దతు తెలిపిన ఐద్వా 
నవతెలంగాణ – మిర్యాలగూడ 
నాకు న్యాయం చేయాలని కోడలు అతని నాలుగేళ్ల కుమారుడితో కలిసి అత్తగారింటి ముందు ధర్నా చేసిన సంఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే….పట్టణంలోని బంగారిగడ్డకు చెందిన భాస్కర శ్రీనివాస్ మంజుల దంపతుల ఏకైక కుమారుడు భాస్కర సాయి దీప్ నల్గొండలోని చర్లపల్లి కు చెందిన సౌందర్య అలియాస్ పల్లవి ప్రేమించుకొని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

వీరికి నాలుగేళ్ల మోక్షిత్ బాబు ఉన్నాడు. వీరు పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరు మధ్య కుటుంబ తగాదాలు నెలకొనడంతో భార్య సౌందర్య,కుమారుడిని తన అమ్మగారి ఇంటికి బంగారిగడ్డలో వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగిరాకపోవడంతో 51 రోజులుగా అన్ని చోట్ల వెతికారు. అతని ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. కాగా తన ఇంట్లో ఉన్న కోడలు, మనవడిని ఇంటి నుంచి గెంటివేయడంతో కోడలు తన కుమారుడు తో కలిసి గురువారం రాత్రంత్ర ఇంటి ముందే నిరసన తెలిపింది.చలిలో ఇంటి ముందే నిద్రించింది.

విషయం తెలుసుకున్న ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి ఆ మహిళ సౌందర్య కు మద్దతు నిలిచారు. సౌందర్య కు న్యాయం చేయాలని ధర్నా చేశారు. ఆ మహిళకు ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన, జిల్లా కమిటి సభ్యులు అరుణ, కౌసల్య మద్దతు నిలిచారు. సౌందర్య కు న్యాయం చేసే విధంగా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సౌందర్య నుంచి ప్రాణహాని ఉంది: వృద్ధ దంపతులు సబ్ కలెక్టర్ ఫిర్యాదు
తన మనవడి భార్య సౌందర్య నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆమె నుంచి తమకు రక్షణ కల్పించాలని వృద్ధ దంపతులు భాస్కర సోమయ్య, అతని భార్య అనసూర్య శుక్రవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు ఫిర్యాదు చేశారు. తన మనవడు భాస్కర సాయిదీప్ ప్రేమించి సౌందర్య ను పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు సాయి దీప్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి రెండు నెలలు దాటాయని అయిన అతని ఆచూకీ లభించలేదన్నారు. మనవడి భార్య సౌందర్య ఇప్పుడు ఇంటి ముందు ధర్నా చేస్తూ తమను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా దుర్భసలాడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె నుంచి ప్రాణ హాని ఉందని ఆమె మా ఇంటి ముందు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -