- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని బొగ్గుల వాగు ప్రాజెక్ట్ కాలువ ద్వారా భారీ స్థాయిలో నీరు రావడంతో ఎడ్లపల్లి శివారు ప్రాంత రైతుల పంట పొలాల్లో నీరు చేరుతుండటంతో రైతులు పొలాలు కోయడం వీలు కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండి పోయే దశలో నీరు వదలకుండా ఇప్పుడు పంట కోత దశలో నీరు వదలడం అవకాశం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. వరి కోతల సమయం కావడం వల్ల ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువ నీరు బంద్ చేయాలని కోరుతున్నారు.
- Advertisement -



