Friday, November 28, 2025
E-PAPER
Homeజిల్లాలుశాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలి

శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలి

- Advertisement -

అమ్మాయిలకు అసమానతలు లేని విద్యను అందించాలి 
నవతెలంగాణ- కంఠేశ్వర్ 

శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలి అని అమ్మాయిలకు అసమానతలు లేని విద్యను అందించాలి అని ఎస్ ఎఫ్ ఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు శిల్ప అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ మూడు రోజుల పాటు చాలా ఉత్సవపూరితంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎస్ ఎఫ్ ఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు శిల్ప  మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్య విధానం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం ఉందని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలకు రక్షణ కల్పిస్తూ అమ్మాయిల కోసం ఏర్పరిచిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అలాగే జిఎస్ క్యాష్ (జండర్ సెన్సిటైజేషన్ సెక్సువల్ హరాస్మెంట్ కమిటీలు) అనేవి కేవలం సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి.

వాటిని యూనివర్సిటీలలో, కళాశాలలో కూడా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతినీ అమలు చేయాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను తీసేసి ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీలలో ఎల్ఓసిఎఫ్ పేరుతో ప్రభుత్వ వర్సిటిలను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యా కాషాయకరణ వ్యతిరేకంగా అమ్మాయిలు పోరాటం చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం చాలా చులకనందుకు చూస్తుంది. విద్యారంగానికి ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటుగా భావించారు. దాని వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతుంది అధికారులు వెంటనే కళాశాలలో అదేవిధంగా యూనివర్సిటీలు తక్షణమే తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను పరిష్కరించాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, కో కన్వీనర్స్ మమత, దీపిక, రమ్య, కావ్య, సుమ అలాగే జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -