డెమొక్రటిక్ టీచర్ పెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.లింగారెడ్డి
నవతెలంగాణ – భూపాలపల్లి:-
విద్య రంగం సంక్షోభంలో పడిందని డెమొక్రటిక్ టీచర్స్ పెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లింగారెడ్డి అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్, కారల్ మార్క్స్ కాలనీలో జిల్లాస్థాయి విద్యా పరిరక్షణ కమిటీ సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యదితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం,దేశంలో విద్యా రంగం సంక్షోభంలో ఉందని, ఈ విద్యారంగాన్ని పుష్కరించే చర్యలు చేపట్టకపోగా ఇంకా సంక్షోభంలోకి నెట్టుతున్నాయని పేర్కొన్నారు. రోజురోజుకు కొత్త కొత్త విధానాలు రూపొందిస్తూ సిలబస్ లో శాస్త్రీయత భావం లేకుండా అశాస్త్రీయంగా మూఢనమ్మకాలను పెంపొందించే విధానాలను రూపొందిస్తున్నారని తెలిపారు. ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో విద్యా పరిరక్షణ కమిటీ దేశంలో అఖిల భారతీయ విద్యా హక్కుల వేదిక రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో విద్యా పరిరక్షణ కమిటీలను వేస్తున్నామని పేర్కొన్నారు. మరో అతిధి టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు మర్చి పోతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా పెట్టుబడిదారులకు అప్పజెప్తారని కాబట్టి విద్యారంగాన్ని రక్షించుకోవాలంటే రాజీలేని పోరాటాలు చేయాలన్నారు.అనంతరం ఎన్నికల అధికారి లింగారెడ్డి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఆమోదించారు.
నూతన కమిటీ.
జిల్లా గౌరవ అధ్యక్షుడుగా ఏ.మహేందర్, అధ్యక్షుడుగా ఏ.తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.సేవానాయక్, అసోసియేట్ అధ్యక్షుగా పి.రమణారెడ్డి. అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా సిహెచ్.సుదర్శన్, పి.సంజీవరెడ్డి, ఎస్.ప్రవీణ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా వై.శ్రీకాంత్,కార్యదర్శులుగా కే.శ్రీనివాస్, కే.సదానందం, డి.శంకరయ్య, ఆర్. జోసెఫ్,ప్రత్యేక ఆహ్వానితులుగా అశోక్, జగపతిరావు ఎన్నికయ్యారు
విద్య రంగం సంక్షోభంలో ఉంది.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



