Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబలహీన వర్గాల బద్ధ శత్రువు బీజేపీ

బలహీన వర్గాల బద్ధ శత్రువు బీజేపీ

- Advertisement -

– కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
– జ్యోతిబా ఫూలేకు నివాళులు
నవతెలంగాణ-అంబర్‌పేట

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలహీన వర్గాలకు బద్ధ శత్రువుగా వ్యవహరిస్తోందని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు విమర్శించారు. జ్యోతిబా ఫూలే ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోం దన్నారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో జ్యోతిబా ఫూలే విగ్రహం వద్ద కేవీ పీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం కేవీపీఎస్‌ నగర కార్యదర్శి బిట్ర సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. అందరికీ విద్య అందించాలనే ఫూలే లక్ష్యాలకు విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఉన్నత విద్యను ధనిక వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తున్నదని అన్నారు. బలహీన వర్గాల ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ, నిజంగా బలహీన వర్గాలకు ఎంత శాతం నిధులు కేటాయిస్తున్నారో వెల్లడించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బీజేపీ అడ్డంకిగా మారిందన్నారు. ఫూలేఆశయాల సాధనకు నేటి సమాజం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా ఫూలే ఆశయాలు ముందుకు సాగుతాయన్నారు. ఈ కార్యక్రమం లో కేవీపీఎస్‌ నాయకులు ఎం. మహేందర్‌, బి.సుబ్బారావు, డి.వెంకటయ్య, జనార్దన్‌, మల్లేష్‌, ఆంజనేయులు, మాధవ్‌, కిషన్‌, అర్జున్‌, సీఐటీయూ అంబర్‌పేట జోన్‌ కన్వీనర్‌ జి.రాములు, ఎస్‌ఎఫ్‌ఐ జోన్‌ కన్వీనర్‌ నాగేందర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -