- Advertisement -
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ
లక్నో : భారత షట్లర్లు తన్వీ శర్మ, ఉన్నతి హుడాలు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సిన్ యాన్ హ్యాపీపై 21-13, 21-19తో తన్వీ శర్మ గెలుపొందగా..సహచర షట్లర్ రక్షితపై 21-15, 13-21, 21-16తో ఉన్నతి హుడా పైచేయి సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-14, 11-4తో ముందంజలో ఉండగా ప్రియాన్షు వాకోవర్‌తో వైదొలిగాడు. మిథున్ మంజునాథ్ 21-18, 21-13తో మన్రాజ్ సింగ్‌పై గెలుపొంది సెమీస్‌కు చేరుకున్నాడు. నేడు సెమీస్‌లో శ్రీకాంత్, మంజునాథ్ తలపడనున్నారు.
- Advertisement -



