Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపార్టీ పరంగా ఇస్తామన్న కోటా ఎక్కడీ

పార్టీ పరంగా ఇస్తామన్న కోటా ఎక్కడీ

- Advertisement -

బీసీ జేఏసీ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీసీలకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌, పార్టీ పరంగా ఇస్తామన్న మాట కూడా ఎందుకు తప్పిందని బీసీ జేఏసీ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ జేఏసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్‌ బీసీల రాజకీయ యుద్ధభేరి సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు చట్టబద్ధంగా ఇస్తామన్నా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోగా, వారిని నమ్మించడానికి తమ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం నుంచి 60 శాతం వరకు జనరల్‌ స్థానాల్లో కూడా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రకటించాయని గుర్తు చేశారు. కానీ దాన్ని ఆచరణలో అమలు చేయడానికి ఆ రెండు పార్టీలు కనీస కసరత్తు కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. జనరల్‌ స్థానాలను కూడా కైవసం చేసుకోవడానికి బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా స్థానాల్లో సర్పంచులుగా ఎన్నికల బరిలో నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనీ, అందులో భాగంగా ఆదివారం చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఇందిరా పార్కు వద్ద రాజకీయ యుద్ధభేరి మహాసభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మెన్‌ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్‌ కుందారం గణేష్‌ చారి, కో చైర్మెన్‌లు శేఖర్‌ సగర, కాటేపల్లి వీరస్వామి, వైస్‌ చైర్మెన్‌ దీటి మల్లయ్య, కవుల జగన్నాథం, జుర్రిగల శ్రీనివాస్‌, పల్లపు సమ్మయ్య, జిల్లల నరసింహ, వెంకటేష్‌ గౌడ్‌, గూడూరు భాస్కర్‌, నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -