Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమాజసేవలో భాగంకండి

సమాజసేవలో భాగంకండి

- Advertisement -

విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపు
టీపీసీసీ డాక్టర్స్‌ సెల్‌ జిల్లాల చైర్మెన్లకు నియామకపత్రాలు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వైద్యులుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న డాక్టర్లు సమాజసేవలోనూ భాగం కావాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ డాక్టర్‌ సెల్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. రాష్ట్ర చైర్మెన్‌, ప్రధాన కార్యదర్శి, ఐదు జిల్లాల చైర్మెన్లు, ఇతర కీలక పదవులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. మిగిలిన రాష్ట్ర, జిల్లా కమిటీల్లో మిగిలిన నియామకాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే నాణ్యత పెరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్‌లోకి పెద్ద సంఖ్యలో డాక్టర్లు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.బీఆర్‌ఎస్‌ వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వైద్యుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడానికి వైద్యులు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. టీపీసీసీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విభాగం రాష్ట్ర చైర్మెన్‌ డాక్టర్‌ రాజీవ్‌ మాట్లాడుతూ కమిటీల నియామకం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి నిర్ణయమని తెలిపారు. వైద్యరంగంలో నిర్మాణాత్మక ఆలోచనలతో పని చేయడానికి అవకాశమిచ్చినందుకు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సలహాలు, సూచనలతో వైద్యరంగంలోని అన్ని విభాగాల సిబ్బంది సంక్షేమం కోసం త్వరలోనే ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. తనను ప్రోత్సహిస్తున్న వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -