టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గాంధీ కుటుంబం ఏం చేసిందంటూ రాహుల్ గాంధీ కుటుంబంలో మూడు పదవులా? అంటూ బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లనీ, లక్ష్మణ్ వయస్సు 69 ఏండ్లని గుర్తుచేశారు. అంతకుముందు నుంచి దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు, చేపట్టిన కార్యక్రమాల గురించి తన తల్లిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. పండిత జవహర్ లాల్ నెహ్రూ భారత ఆహార సంస్థను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చారనీ, ఇందిరాగాంధీ పెత్తందార్ల భూములను పేదలకు పంచిందనీ, బ్యాంకులను జాతీయం చేసి పల్లెలకు వాటి సేవలను విస్తరింపజేసిందనీ, రాజీవ్ గాంధీ 18 ఏండ్లకే ఓటు హక్కు కల్పించారనీ, ఐటీని అభివృద్ధి చేశారనీ, సోనియాగాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం రెండు సార్లు వచ్చినా ఆ స్థానంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నిలిపిందని తెలిపారు. ఈ దేశ నిర్మాణం కోసం మోడీ, అమిత్ షాలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ లక్ష్మణ్ ఏం చేశారని ఎంపీగా, పార్లమెంట్ బోర్డు మెంబర్‌గా రెండు పదవుల్లో కొనసాగుతున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు, సేవలపై చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
గాంధీ కుటుంబం గొప్పతనం తెలుసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



