– జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజరాజ
– హైదరాబాద్ డిస్టిక్ లెవెల్ చెకుముకి సైన్స్ సంబురాలు
నవ తెలంగాణ- జూబ్లీహిల్స్
సమాజాభివృద్ధి సాధించడంలో సైన్స్ పాత్ర అజరామరమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజరాజ అన్నారు. సైన్స్‌తోనే సమాజం దినదినాభివృద్ధి చెందుతోందని, సైన్స్ లేకుంటే సమాజ మనుగడే లేదని చెప్పారు. సమాజాభివృద్ధిలో శాస్త్రజ్ఞులు, విజ్ఞానవేత్తల కృషి ఎంతో ఉందన్నారు. సైన్స్ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలని చెప్పారు. జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీనివాసనగర్ వెస్ట్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. 200 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన రాతపరీక్షలో నాలుగు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేశారు.
సీఎస్సీఎంబీ రీసెర్చ్ స్కాలర్ ఆదిత్య ఉండ్రే మాట్లాడుతూ.. ప్రశ్నించేతత్వం సమాజ గతిని మార్చ గలదని చెప్పారు. విద్యార్థులు ప్రశ్నించడం మానొద్దని సూచించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ.. పాఠ్యాంశాల నుంచి జీవపరి ణామ సిద్ధాంతాన్ని తొలగించడం అత్యంత విచారకరమని, ఇది విద్యార్థులను మూఢనమ్మకాల దిశగా నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్‌కు నిధులు తగ్గిస్తూ.. సైన్స్ కాంగ్రెస్‌లను నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ ”కథలు- సైన్స్-మూఢవిశ్వాసాలు” అనే అంశంపై విద్యార్థులను ఆలరించారు.
ప్రముఖ రచయిత నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు మూఢవిశ్వాసాలను విడనా డాలని, చిన్నప్పటి నుంచి సైన్స్‌ను మక్కువ చేసుకోవాలని సూచించారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.
విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం
జిల్లా స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. జిల్లా స్థాయి విజేతలుగా గవర్నమెంట్ ఇంగ్లిష్ మీడియం: జెడ్పీ హైస్కూల్, రామంతపూర్, తెలుగు మీడియం: జెడ్పీ హైస్కూల్, అమీర్‌పేట్ నెంబర్ వన్, రెసిడెన్షియల్ స్కూల్స్: టీజీఎస్‌డబ్ల్యూఆర్ బార్సు, గౌలిదొడ్డి, ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం: సెయింట్ ఆన్స్ హైస్కూల్ (రామ్‌నగర్) నిలిచి రాష్ట్రస్థాయి చెకుముకి సంబరాలకు అర్హత సాధించాయి. బహుమతి ఉత్సవాలకు కావలసిన ఆర్థిక సహకారాన్ని ప్రొఫెసర్ త్రిలోత్తంరెడ్డి కొలను అందించారు.
ఈ కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.భరత్, కార్యదర్శి ఎం.రవీంద్రబాబు, నాయకులు లింగ స్వామి, ఎన్.శ్రీనివాస్, వి.రాహుల్, కె.సూర్యనారాయణ, శాంతి ఇషాన్, శ్రీనివాస్ గౌడ్, వై.యాదగిరి, జి.రాజశేఖర్ సాయి, రసూల్, చి.చంద్రశేఖరరావు, టి.విద్యాసాగర్ పాల్గొన్నారు.
సమాజాభివృద్ధిలో సైన్స్ పాత్ర అజరామరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



